• మనుష్యలు దేవునిమీద చేసిన మొదటి తిరుగుబాటు గురించి వ్రాయబడినది (ఆదికాండము 3:1-6)

చివరి తిరుగుబాటు గురించి వ్రాయబడినది (ప్రకటన 20:7-10)

  • పాపము యొక్క ప్రవేశము గురించి వ్రాయబడినది (ఆదికాండము 3:1-6)

పాపము యొక్క నిష్క్రమణ గురించి వ్రాయబడినది (ప్రకటన 20:10; 21:4-8)

  • మనమీద ఉంచబడిన శాపము గురించి వ్రాయబడినది (ఆదికాండము 3:9-19)

శాపము తీసివేయబడుట గురించి వ్రాయబడినది (ప్రకటన 22:3)

  • మరణము యొక్క ఆరంభము గురించి వ్రాయబడినది (ఆదికాండము 3:19)

మరణము యొక్క అంతము గురించి వ్రాయబడినది (ప్రకటన 21:4)

  • ప్రస్తు తము మనము నివసిస్తు న్న భూమి, ఆకాశములు చేయటము గురించి వ్రాయబడినది (ఆదికాండము 1:1)

నూతన ఆకాశము, భూమి గురించి వ్రాయబడినది (ప్రకటన 21:1)

  • దేవుని స్వరూపము, ఆశీర్వాదము పోగొట్టుకున్నాము (ఆదికాండము)

ప్రభువైన యేసుక్రీస్తు వారిద్వారా తిరిగి దానిని పొందుకున్నాము (ప్రకటన)

  • మానవుల యొక్క పతనము గురించి వ్రాయబడినది (ఆదికాండము)

యేసుక్రీస్తు వారిద్వారా మానవుల యొక్క విజయము గురించి వ్రాయబడినది (ప్రకటన)

  • జీవవృక్షము పోగొట్టుకొనబడినది (ఆదికాండము 3:24)

జీవవృక్షము తిరిగి లభించినది (ప్రకటన 22:2)