ఆజ్ఞ వ్యక్తి వచనము
మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి ఆదాము 1:27
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు ఆదాము 2:17
చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము నోవహు 6:14
సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను నోవహు 6:19
నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి నోవహు 7:1
నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి నోవహు 8:16
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి నోవహు 9:1
నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము అబ్రాహాము 12:1
ఇతడు నీకు వారసుడు కాడు అబ్రాహాము 15:4
మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్ము అబ్రాహాము 15:9
మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను అబ్రాహాము 17:11
నీ పేరు అబ్రాహాము అన బడును అబ్రాహాము 17:5
నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా అబ్రాహాము 17:15
నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతనిని అర్పించుము అబ్రాహాము 22:2
నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఇస్సాకు 26:2
ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను యాకోబు 32:28
నీవు లేచి బేతేలునకు  వెళ్లి అక్కడ నివసించుము యాకోబు 35:1
ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము యాకోబు 46:3