దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)

కొన్ని జంతువులలో మంచి లక్షణములు, చెడు లక్షణములు కలసి ఉంటాయి. ఉదాహరణకు కుక్క. అది విశ్వాసమునకు మారుపేరుగా మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది తను కక్కిన వాంతిని మరలా తినే చెడు స్వభావము కూడా కలిగి ఉంది. తనకు శతృవుగా కనిపించేవారిని గురించి హెచ్చరించే స్వభావముతో పాటుగా, మనస్సు సరిగా లేకపోతే కరచే స్వభావము కూడా ఉంది. ఇలాగున ద్వంధ స్వభావము కలిగినవాటిని ప్రభువు ఉపయోగించినట్లు లేఖనములో కనిపించదు. ఒక్క నులివెచ్చని లక్షణము కలిగి ఉన్నా కూడా పవిత్ర జంతువుగా పరిగణించబడదు. నులివెచ్చని స్థితి ప్రభువునకు ఇస్టము ఉండదు. అందుకే సేవకులలో ద్వంధ స్వభావము ఉండకూడదు. ఉంటే ప్రభువు దగ్గర మనము అంగీకరించబడము. సంఘములోను, పరిచర్య విషయములోను, సమాజములోను ఒకే విధమైన జీవనశైలిని కలిగి ఉండాలి. ఒక్కొచోట ఒక్కో రకముగా ఉండకూడదు. ప్రకటన గ్రంధములో ప్రతి ఒక్క సంఘమునకు దేవుడు క్రియల విషయము హెచ్చరించినట్లుగా చూడగలము. ఆయన రాజీపడే దేవుడు కాదు. పనులు చేస్తున్నావు కదా అని మెచ్చుకోడు. నీలో సంపూర్ణమైన మారుమనస్సు, నూతన జీవిత అనుభవము కలిగి ఉండాలి. మరి నీవు వాటిని కలిగి ఉన్నావా? నీలో ఉన్న మాలిన్యము కడిగి తీసివేసుకుంటున్నావా?పాపము విషయమై నీ జీవితము సంపూర్ణముగా మరణించినదా?ఉమ్మివేయబడకుండా జాగ్రత్తపడు.

కొన్ని జంతువులు ఆహారము తిన్న తరువాత నెమరు వేసుకునే అలవాటు కలిగి ఉంటాయి. ఇది చాలా మంచి లక్షణము. మనము సమయము దొరికినపుడు మనము చదివిన వాక్యమును గుర్తు చేసుకుని దానిని ధ్యానించాలి. అందులో ప్రతి పదమును తీసుకుని అర్ధము తెలుసుకుని విశ్లేషణ చేస్తూ మన యొక్క ప్రవర్తన, జీవితము ఆ ప్రకారము ఉన్నావో లేదో తెలుసుకోవాలి. నీవు వాక్యమును ధ్యానిస్తున్నావా లేక ఊరికే చదివి వదిలిపెడుతున్నావా? వదిలిపెట్టేస్తే అందులో ఉన్న రుచిని మిస్ అవుతాము. బాగుగా నమిలినపుడే జీర్ణము సులభముగా అయినట్లు, వాక్యమును మనము బాగుగా ధ్యానించినపుడే పరిశుద్ద గ్రంధము మనకు సులభముగా అర్ధము అవుతుంది. సగము నమిలి మింగితే కడుపు అంతా ఉబ్బరముగాను, భారముగా అనిపించినట్లు వాక్యము అర్ధము చేసికొనుట, పాటించుట చాలా కష్టముగాను, భారముగాను అనిపిస్తుంది. తన కాడి చాలా తేలిక, తన భారము సులువు అని ప్రభువే స్వయముగా చెప్పారు కాబట్టి మనమే అది భారము, బరువు అని ఫీల్ అవుతున్నాము. అంటే లోపము మనలోనే ఉన్నది. మనము పనిని చేయవలసిన విధముగా లేదా approach అవ్వాల్సిన రీతిగా అవటము లేదు అని అర్ధము. ఇప్పటికైనా కన్నులు తెరుచుకొని ఆచారబద్దమైన,మతపరమైన అలవాట్లు మానివేసి ప్రభువు చూపించిన, సూచించిన మార్గములో నడుచుకుందాము. ఆయన సేవ సులువుగా చేసి ఆనందిద్దాము. ప్రభువు ఎవరిమీద మోయలేని భారము పెట్టినట్లు లేఖనములో కనిపించదు. అది కపట శిష్యులు, మత బోధకుల (శాస్త్రులు, పరిసయ్యులు) ద్వారా మాత్రమే జరిగినది. అపోస్తలుల ద్వారా జరగలేదు. నిజమైన శిష్యుల ద్వారా కూడా జరుగలేదు. సేవకులమైన మనము ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండాలి తప్ప మత బోధకులుగా కాదు.

పగలు పనిచేసిన జంతువులు రాత్రిపూట విశ్రాంతి తీసుకుని మరుసటి ఉదయకాలపు పనికి వాటిని సిద్దము చేసుకుంటాయి. సేవ చేసే విషయములో మనకు విశ్రాంతి కూడా అవసరము అని గుర్తించాలి. మన శరీరములకు సహజసిద్దముగా ఉన్న బలహీనతలు, నిర్మాణమును బట్టి ఇది అవసరము. సేవలో అలుపులేకుండా చేయాలి కానీ అవిశ్రాంతముగా చేయమని ఎక్కడా లేదు. అది దేవునికి మాత్రమే సాధ్యము. మనకి కాదు. కాబట్టివిశ్రాంతి తీసుకోకుండా అతిగా పరిగెత్తటము కూడా మంచి మాదిరి కాదు. దాని ద్వారా మనము త్వరగా రిటైర్ అవవలసి వస్తుంది. సేవ కూడా అలసట వలన క్వాలిటిగా చేయలేము. దేవుడు quantity కన్నా క్వాలిటి చేసే వ్యక్తి అని మనకందరికీ తెలిసిన విషయమే. ఒక ఎద్దు త్వరగా నడచి మరొక ఎద్దు నిదానముగా నడిస్తే బండి ఏలాగున సరిగా నడవదో అలానే సేవ కూడా సరిగా జరుగదు. రాజ్యభారమును అందరమూ భుజముల మీద వేసుకున్నప్పుడు consistent స్పీడ్ లో నడవాలి. అపుడే అది సవ్యముగా నడుస్తుంది. జంతువులు కలసి ప్రయాణము చేస్తున్నప్పుడు కూడా గుంపుగా కలసి వెళ్తాయి. స్పీడ్ proper గా sync లో maintain చేస్తాయి. అంతేకానీ కొన్ని ముందు పరిగెత్తుకుంటూ వెళ్లవు. అలానే మనము కూడా ఇతరులతో sync లో వెళ్లాలి. నీలో ఏమైనా ముందు పరిగెత్తాలి అనిపించే అత్యుత్సాహము ఉందేమో గుర్తించి సరిచేసుకో.