దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
ఈ విధముగా మనము ఏలవలసియుండగా ఒకవేళ మనము శత్రువు చేతిలో కనుక ఓడిపోతే అతను మనలను బంధకములతో బందించి, మనలను తన బానిసగా చేసుకుంటాడు. మనము రాజుగా కాకుండా దాసునిగా ఉండవలసి వస్తుంది. ఈ విధముగా వేరొక శత్రువు మన రాజ్యము హస్తగతము చేసుకున్నప్పుడు అతను దానిని సరిగా పరిపాలించడు, దానిని నాశనము చేస్తాడు. ఇదే విషయము చరిత్రలో మనము అనేక పర్యాయములు చూడగలము. అలాగున మన భూమికూడా మనము సాతాను చేతిలో మోసపోయినపుడు నాశనము చేయబడినది. మరలా మనము తిరిగి బలము పొందుకుని వాడిని జయించకుండా సాతాను మనలను అనుక్షణము బలహీనపరుస్తూ ఉంటాడు. మనము ఈ క్రమములో చాలాసార్లు ప్రయత్నము చేసి ఓడిపోతాము. మన పితరులలో సహితము ఇదే జరిగినది. అందుకే మనలను విడిపించుటకు దేవుడు వేరాక రాజును పంపవలసి వచ్చినది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మాత్రమే మనము అందరమూ బంధకములనుంచి విడిపించబడి ఆయన పోషణ ద్వారా బలము సంపాదించుకుని, తిరిగి మన స్థానములోనికి చేరటము జరిగినది. అందుకే ఆయన ద్వారా మాత్రమే మనము మన original destiny సాధించగలము. ఆయన ద్వారా మాత్రమే మన బలహీనతలను జయించగలము. ఆయన ముందు జయించాడు కాబట్టి మనకు అన్నివిధాలా సహాయము చేయగలడు. నాశనము అయిన నీ జీవితమును ఆయన మాత్రమే కట్టగలడు
దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును అని చెప్పబడిన విధముగా సాతాను మనకు ఇవ్వబడిన ఈ అధికారమును దొంగిలించుటకు మాత్రమే వస్తాడు తప్ప వాడికి మనమీద ఏ విధమైన ప్రేమ, అభిమానము, మన జీవితములను బాగుచేయాలి అనే ఉద్దేశ్యము లేదు. వాడు మనకు చూపించే అనేకమైన ఆకర్షణల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశము అదే. వాడికి ఆరాధన, పూజ పొందాలి అని కోరిక. అదే వాడిని పతనం చేసింది. మనము వీడి వలలో పడటము వలన వీడు అధికారము చెలాయించి సంతృప్తి పొందుతూ ఉంటాడు. మన ఆది పితరులను కూడా వాడు అలానే మోసము చేసాడు. లేనిది ఉన్నది అన్నట్లుగా ఆశ చూపించాడు. వాడి మాయలో పడితే కేవలము మన ఆది పితరులే కాకుండా మానవాళి మొత్తము బానిసత్వములో చిక్కినట్లు, మన ద్వారా మన వెనుక తరములు అన్ని కూడా వాడి వలలో చిక్కుకుంటాయి. అందుకే దేవుడు వెనుక తరముల గురించి పదే పదే మనలను హెచ్చరించటము జరిగినది. మనము వాడి మాయలో పడకుండా ఉండాలి అంటే వాక్యము ద్వారా మన మనస్సు నూతనపరచుకోవటము తప్ప మరే మార్గము కూడా లేదు. అందుకే దేవుడు వాక్యము గురించి మన జీవితములో అంత Emphasis ఇచ్చినది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు, హృదయము కొరకు అనుదినము మనము ప్రార్ధన చేయాలి. వాడి tricks గుర్తించేలాగున వివేచన అడగాలి. నీవు సాతాను ఆకర్షణలకు లొంగుతున్నావా? ఆదాము, హవ్వకు వాడి మాట విన్న తరువాత దుఃఖము తప్ప inch కూడా సంతోషము 1 సెకండ్ కూడా దక్కలేదు అని గుర్తుంచుకో
మనము దేవుని యొక్క వాగ్దానము స్వతంత్రించుకోవాలి. మన original destiny లోనికి మనము ప్రవేశించాలి అంటే ఆ దేవుడు ఆశీర్వదించటానికి ముందు సృష్టించిన పరిస్థితులు లోనికి మనము నడవాలి. వీటిని మనము స్వతంత్రించుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యము అవుతుంది. కాని మనలో చాలామందిమి మన attitude, ప్రవర్తన మార్చుకొనకుండా దేవునిని పదే పదే ప్రార్ధనలో మనలను రక్షించమని ప్రాధేయపడినంత మాత్రమున ఉపయోగము ఉండదు. దేవుడు అలాంటి ప్రార్ధనలు అనేక మార్లు ఆలకించి మనలను విడిపించినను, మరల కొద్ది కాలమునకు వెనుకకు పాపములో పడిపోవటం జరుగుతుంది. దీని ద్వారా మనము ఒకరోజుకు విసికిపోయి ఆ దేవుని విడిచిపెట్టి మన ఆత్మను నాశనము చేసుకుంటాము. ఇక్కడ సమస్య దేవునితో కాకుండా మన approach లో ఉన్నది అన్న విషయము మర్చిపోకూడదు. దీనికి Permanent గా విజయము సాధించాలి అంటే మనము Born again experience, మారుమనస్సు పొందటము మాత్రమే మార్గము. మనము ఆయన స్వరూపము, పోలికె లోనికి మారనంత వరకూ ఇలానే గెలుపు, ఓటముల ఒడిదుడుకులు ఉంటాయి. మన జీవితములో Stability, peace సమాధానము ఉండవు. ఇప్పటికైనా మనలో ఉన్న లోపము గుర్తించి మన అధికారము చేజిక్కించుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలసి పరిశుద్ధాత్మ సహాయముతో ప్రయాణము ప్రారంబిద్దాము.