దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. (1:31)
ఈ అధ్యాయములోని ఆఖరి వచనము ఇది. దేవుడు తన సృష్టి చేయడము ముగించిన తరువాత పలికిన చివరిమాట. దీనిలో ఆరవదినము ముగియటం కూడా మనము చూడగలము. తను చేసిన సృష్టి మొత్తమును పరిశీలన చేసి దేవుడు పలికిన మాట ఇది. చాలా మంచిదిగ ఉండెను అనే మాట అనుదినము మంచిది అని పలికిన మాటకన్నా మెరుగ్గా ఉన్నది. దీనిని బట్టి దేవుడు అనుదినము మన జీవితములో చేయు కార్యములు మంచివి గాను, వాటి అంతమున అవి మొత్తము చాలా మంచివిగాను ఉంటాయి. ఒక్కొక్క ముత్యము విడిగా చూసినప్పుడు అందముగా కనిపిస్తుంది. ముత్యములు అన్నీ ఒక చోట కూర్చి మాలగా కట్టినప్పుడు అద్భుతమైన హారము తయారవుతుంది. అదే మాదిరిగా దేవుడు కూడా మన జీవితాన్ని మలుస్తారు. ఆరు దినములలోగా తన సృష్టిని సంపూర్ణము చేసినట్లు, మన జీవితమును కూడా ప్రతి రోజు కడుతూ మనలను సంపూర్ణతలోనికి నడిపిస్తారు. దేవుడు చేసే ప్రతి పని వెనుక ఆయన చివరలో రావాలకున్న ఫలితము దాగి ఉంటుంది. ఆ బృహత్తర ప్రణాళికలో బాగముగా ఆయన మన జీవితములో పని చేస్తారు. మనము అంతము వరకు సహనముతో కనిపెట్టుకుని ఉండకపోతే శ్రేష్టమైన ఫలితమును ఫలమును పొందలేము. అందుకే పౌలు భక్తుడు చెప్పిన విధముగా మన పరుగు కడముట్టించి ప్రభువు ఇచ్చు బహుమానము పొందుటకు మనకు ఓరిమి అవసరమై ఉన్నది. మరి నీవు నీ జీవితములో దేవుడు చేయాలి అనుకున్న చాలా మంచి కార్యము ఏమిటో గుర్తించావా? దానిని నెరవేర్చుటకు ఆయనకు సహకారము అందిస్తూ ఓపికతో ఎదురు చూస్తున్నావా? మనము మన జీవితములను మన ప్రమాణములను అనుసరించి మంచివిగా చేసుకోగలమేమో కాని, దేవుడు మాత్రము పరలోకపు ప్రమాణములను అనుసరించి మన జీవితమును చాలా మంచిదిగా చేస్తారు.
ప్రభువు యొక్క రాకడ, మన మరణము ఎప్పుడు అనేది మనకు తెలియనిది కాబట్టి అనుదినము నిద్రించుటకు ముందు మన ప్రవర్తన దేవుని వాక్యములోను, ఆయన తాను సరిచూసుకోవాలి. అప్పుడు ఏ దినమున ఆయన వచ్చినా , లేక మరణము సంభవించినా మనము సిద్ధముగా ఉంటాము. మన ప్రవర్తన మన కొలమానముతో సరిచూసుకుని మనలో మనము మురిసిపోకూడదు. ఆయన త్రాసులో మనము ఎలా తూగుతున్నాము అనేది ముఖ్యము. ఆయన కొలమానమును బట్టి మన భవిత ఆధారపడి ఉంది. అలాగున ఆయనలో సంబాషించి సరిచూసుకున్న తరువాత సరిదిద్దుకోవలసిన వాటిమీద దృష్టిపెట్టి వాటికొరకు పనిచేయాలి. మన జీవితము అంతమున వెనుదిరిగి చూసినపుడు అది చాలా మంచిదిగ ఉండాలి.
మొత్తము ఆరు దినముల సృష్టిని మనము గమనించినపుడు ఆయన తలచుకుంటే దానిని మొత్తమును కూడా ఒక్క దినములో చేయగలరు. కాని ఆయన step by step సమస్తము చాలా మంచిగ చేసినట్లు మన జీవితములో కూడా ఆయన step by step కార్యము చేస్తారు. ఆయన సమయములో, ఆయన ప్రణాళికను అనుసరించి దానిని చాలా మంచిదిగా చేస్తారు. పరిశుద్ధ గ్రంధములోని భక్తుల జీవిత చరిత్రలు చూసినప్పుడు కూడా ఈ విషయము మనకు అర్థము అవుతుంది. ఎవరూకూడా instant గా పరిపూర్ణతలోనికి రాలేదు. దేవుడు వారి జీవితములలో అనుదినము పనిచేసి దినములు గడిచేకొద్దీ వారిని విశ్వాసవీరులుగా, ముందు తరముల వారికి సాక్షి సమూహముగా మార్చడము జరిగినది.
ఈ యొక్క వచనము ద్వారా దేవుడు మనము చేయబోయే ప్రతి పనికి standard నియమించటము జరిగినది. అనుదినము శక్తివంచన లేకుండా చేస్తూ చివరకు ముగింపులో దానిని చాలా మంచిగా చేయాలి. అందుకు కావలసిన జ్ణానము దేవుడు ఇస్తారు.
ఇంతకు ముందు వచనములలో మనము చూసినట్లు, ఆయన సృష్టినుంచే అన్ని రకముల Subjects వచ్చాయి కాబట్టి, మనము చేసే ప్రతి పనిలోను ఆయన సహాయము చేయగలరు. అందులో – అద్బుతమైన standards మనకు నేర్పించగలరు. ఆయన ద్వారా చేయబడిన దానిలో లోపము కనుగొనలేము అని ఆయన సృష్టిని చూసి మనము సులభముగా చెప్పవచ్చును.
ఈ విధముగా దేవుడు తన credibility, capability establish చేసారు. మనకు కేవలము మాటలలో మాత్రమే కాకుండా, తన చేతలలో ఆయన ఏమిటి, ఏమి చేయగలరు అనేది రుజువు పరచారు. ఆయన చేసిన ఈ అద్భుతమైన పనుల మీద మనకు అధికారము ఇచ్చినట్లుగా, మనము కూడా మన చేతిపనుల మీద ఆయనకు అధికారము ఇవ్వాలి. అప్పుడు అది సరైన కృతజ్ఞత అనిపించుకుంటుంది. ఆయన దేనిని అయినా లోపము లేనిదిగా చేయగల సమర్థుడు. మనము సంశయింపక ఆయన expertise ను జీవితమును కట్టుకొనుటకు ఉపయోగిద్దాము. ఆయనకు fees చెల్లించవలసిన అవసరము లేదు. HE is available 24×7 for us మనకు అర్థము అయ్యే విధముగా సమస్తమును బోధించుట ఆయన ప్రత్యేకత. We are really blessed to have such expert on our side . ఆయనలో జతకలసి పని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయము చేయును గాక ఆమెన్.