దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను  ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)

కేవలము స్వరూపము, పోలికే గురించి మాత్రమే చర్చ జరుగకుండా మానవుని పుట్టుక, సృష్టి వెనుక గల ఉద్దేశ్యమును కూడా ఇక్కడ వివరించటము జరిగినది. దీనిని బట్టి మానవుడు – ఊరికే చేయబడలేదు అతనికి దేవుడు ఒక destiny అనేది – నిర్ణయించడము జరిగినది ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము అతను చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథము కూడా దేవుడు మనము పుట్టకముండే మనము చేయాలి అని సంకల్పించిన మంచి పనులు ఉన్నాయి అని. ఈ విధముగా సృజించబడిన మరి ఏ జీవి విషయములోను దేవుడు పలకడము అనేది మనము గమనించము. అన్నింటికన్నా అత్యధికమైన ఘనత మానవునికి – ఇవ్వడము జరిగినది. అందుకే మనలో ఎవరమూ కూడా నేను పనికిరాని వాడను, నేను అనవసరముగా పుట్టాను అనే మాటలు అనుకోకూడదు. మన జీవితములోని పరిస్థితులు అన్నీ కూడా మనము స్వంతముగా తీసుకున్న నిర్ణయాలు మరియు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన Counsellingతీసుకోకుండా చేసిన పనుల ద్వారా సంక్రమించినవే. వీటి నిమిత్తము మనము దేవుని నిందంచకూడదు. మనము ఎప్పటికైనా (సమయము భూమి మీద ఉండగానే) పశ్చాత్తాపము చెందితే ఆయన మన జీవితమును సరిదిద్దుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మరి నీ జీవితములో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశ్యము గుర్తించి వెంబడిస్తున్నావా లేక నీ స్వంత ఉదేశ్యములను వెంబడిస్తున్నావా? దానిని బట్టి నీ జీవన పరిస్థితులు ఆధారపడి ఉంటాయి.

భూమిని గాడాంధకారము కమ్మిన క్షణమునుండి ఇప్పటివరకు ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు మనకు కనిపించదు. కాని మానవుని తన స్వరూపములోను, పోలికెలోను సృజించిన తరువాత మరలా దేనిని సృజించినట్లుగా మనకు కనిపించదు. తరువాత దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకు లేఖనము సెలవిస్తుంది. అనగా – మనము పాపములో పడి అంధకారములో మునిగిన దినమునుంచి ఆయన స్వారూప్యము, పొలికె మనలో వచ్చు వరకు ఆయన అవిశ్రాంతముగా మన జీవితములో పని చేస్తూనే ఉంటాడు. ఇది ఆయన మనపట్ల కలిగి ఉన్న commitment, dedication తెలియజేస్తుంది. అయితే మనమే ఈ విధమైన dedication, commitment – మీన జీవితములో దేవుని పట్ల కనుపరచడము లేదు. ఇది మన జీవితమును బాగుచేయుట కొరకే అని తెలిసినా కూడా బహుగా నిర్లక్ష్యము వహిస్తున్నాము. అందుకే దేవుని యొక్క కార్యములు మన జీవితములో బాగా ఆలస్యము అవుతున్నాయి. దేవుడు step by step ఈ స్థితికి తీసుకునివస్తారు తప్ప సమస్తము ఒకేసారి జరిగిపోదు అని గ్రహించి అంతమువరకు సహనముతో కనిపెట్టాలి. లేనియెడల నష్టపోయేది మనమే అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అవసరము మనది . అయినా కూడా మనము దేవుని చుట్టు తిరగటము లేదు. ఆయనే మన చుట్టూ తిరగాల్సి రావడము మనలో ఉన్న అలక్ష్యము, అహంకారమునకు పరాకాష్ట. ఇప్పటికైనా కనులు తెరచి ఆయన dedications కు మనము కృతజ్ఞత చెల్లించి సమర్పించుకుందాము. మనలో ఉన్న నిర్లక్ష్యము (శరీరము లోనిది) మన ఆత్మను నాశనము చేయకుండా కాపాడుకుందాము. ఆయన మనతో ఎప్పుడూ ఉన్నట్లే మనము కూడా ఎల్లప్పడూ ఆయనకు అందుబాటులో ఉందాము.

ఈ సృష్టిలో మనిషితో పోల్చుకుంటే ఆకారములోను, పనిలోను గొప్పవి ఎన్నో ఉన్నను, దేవుడు తన యొక్క స్వరూపమును, పోలికెను దేనికి కూడా ఇవ్వలేదు. ఆ యొక్క అదృష్టము మానవులమైన నరులకు మాత్రమే దక్కినది – తల్లి తండ్రులు ఎపుడైన పిల్లలు తమకు బాగా నచ్చిన, ప్రేమించిన వారి పోలికలో పుట్టాలి అని కోరుకుంటారు. అలా పుట్టిన పిల్లలను అమితముగా ప్రేమిస్తారు. వారి పోలికలోనే కనుక పుడితే అందరితో చెప్పుకుని మురిసిపోతారు. అలానే దేవుడు కూడా తన ప్రేమను అంతా కలగలిపి మనను చేయటము జరిగినది. మిగిలిన సమస్తమును ఆయన నోటి మాటతో చేస్తే, కేవలము మనిషిని మాత్రమే తన స్వహస్తములతో నిర్మించడము జరిగినది. ఈ విషయము మనకు ఆదికాండము 2వ అధ్యాయమును బట్టి స్పష్టమవుతూ ఉంది. 5వ దినమున, 6వ దినము మొదటి భాగమున జీవము కలిగి అని నోటిమాట ద్వారా వాటిలో జీవము నింపిన దేవుడు మనిషి విషయములో మాత్రము తానే స్వయముగా జీవవాయువును ఊదటము జరిగినది. ఇంత అపురూపముగా దేవుడు మానవుని సృష్టించాడు. నేల తడిసి ఉన్నప్పుడు దేవుడు నేల మంటితో నరుని నిర్మించెను అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంతటి గొప్ప సార్వభౌమాధికారి సింహాసనము మీదనుండి దిగి పాదపీటము వంటి భూమిమీదకు వచ్చి మట్టిలో చెయి పెట్టి మనలను చేయటము అనేది ఆయన ప్రేమ గురించి ఎన్నో టన్నులు మనకు తెలియజేస్తుంది. తన స్వరూపము, పోలికె ద్యారా కుమారత్వము – మనకు సంక్రమించినది. నీవు ఆయనకు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నావు?