దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను (1:11-13).

దేవుడు మూడవ దినమున చేసిన ఈ యొక్క పనిద్వారా ఒక అద్భుతమైన కళాఖండములాగా భూమి తయారు అయ్యింది. లోకంలోని ప్రతి చిత్రకారునికి, కవికి ఇదే ప్రేరణగా నిలిచింది. ఈ యొక్క అందమైన ప్రకృతిని చూసి మనము అందరము కూడా మైమరచిపోతున్నాము. ప్రతి ఒక్కరమూ ఆ ప్రకృతి యొక్క అందమైన ఫోటోలను మన గృహములలో మన చుట్టుప్రక్కల ఉంచుకుటున్నాము. ఈ ప్రకృతి అందము యొక్క చిన్న నకలుగా parkలను తీర్చిదిద్ది సాయంత్రము వేళ ఆహ్లాదముగా గడుపుచున్నాము. ప్రతి మనిషి తన జీవితములో ఎంతో కొంత డబ్బు అనేది వ్యయము చేసి ఈ సుందరమైన ప్రదేశములను చూడటానికి వెళ్లి అప్పటివరకు తాము లోకములో పొందిన శారీరక శ్రమనుంచి ఉపశమనము పొందుతూ ఉంటారు. ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులతో పోల్చి ఒక మనిషి ఏదైనా అందాన్నివర్ణిస్తాడు. ప్రకృతి మన జీవితముతో పెనవేసుకుని ఉన్నది అని చెప్పటము అతిశయోక్తి కాదు. ఈ ప్రకృతి యొక్క శబ్దములను అనుసరించి చేసిన సంగీతమునకు కూడా విపరీతమైన గిరాకీ ఉన్నది. అలానే మనము అందరము కలిసి దేవుని చేతిక్రింద విధేయత కలిగి ఉంటే ఆయన మన జీవితములను, సమాజమును అంతే అందంగా తీర్చిదిద్దగలరు. ఆయన చేసిన పని చూశాక అయినా ఆయనమీద విశ్వాసము ఉంచు. ఎన్నివేల సంవత్సరములు అయినా వన్నె తగ్గకుండా ప్రకృతి, దాని సౌందర్యము ఇంకను అలానే ఉంది

స్తుతి

 1. మనకు అవసరమైన ఆహారము అందించుటకు భూమిని సిద్ధము చేసినందుకు
 2. మనము ఫలించి ఎదగటానికి అన్నివిధాల సహాయము చేస్తున్నందుకు
 3. మనకొరకు చాలా రకముల పండ్లవృక్షములను సిద్ధము చేసినందుకు
 4. మనలను నిరుపయోగమైన భూమిగా వదిలివేయనందుకు
 5. శాపమునకు గురి అయిన భూమిని ఆయన కుమారుని రక్తము ద్వారా విడుదల ఇచ్చినందుకు
 6. మనలో ఆయన స్వరూపము, పోలికే అనే విత్తనము ఇచ్చినందుకు

ఆరాధన

 1. అయన చిత్తానుసారము ఫలించుట ద్వారా ఆయనను ఆరాధించాలి
 2. ఐక్యత కలిగి ఆయన మనలో ఉన్న ఫలమును బట్టి మనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుట ద్వారా ఆయనను ఆరాధించాలి
 3. విత్తువాని ఉపమానములో మాదిరిగా మన హృదయమును అనుదినము మంచి నేలగా చేసుకొనుట ద్వారా ఆయనను ఆరాధించాలి
 4. ఆయన మన ఎదుగుదల కొరకు చేస్తున్న ప్రయత్నము, ప్రయాస గుర్తించి వాటికి సరిగా ప్రతిస్పందించుట ద్వారా ఆయనను ఆరాధించాలి

హెచ్చరిక

 1. మనము ఆయనలో ఫలించకపోతే అది మంచిది కాదు అని ఈ యొక్క వచనములు మనలను హెచ్చరిస్తున్నాయి
 2. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది
 3. కానిఫలములు ఫలించు ప్రతిచెట్టు తొక్కివేయబడునట్లు విడిచిపెట్టబడుతుంది

సత్యము

 1. మనము ఎల్లప్పుడూ ఫలించేవారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దానిద్వారా అసలైన ఆత్మీయ జీవితము ఎలాంటిది అనేది లోకమునకు చూపించాలి అనేది ఆయన ఉద్దేశ్యము
 2. ఆయన మనపట్ల కలిగివున్న ప్రణాళిక లేదా చిత్తమును ఆయన మన జీవితములో విత్తనముగా విత్తుతారు
 3. మనము మనలాంటి వారిని పుట్టించుట ద్వారా లోకమును అయన మహిమతో నింపాలి, దానిని మరలా పూర్వ వైభవమునకు రప్పించాలి అని దేవుని ప్రయత్నము