దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).

ప్రార్ధనలో దేవుని ముఖాముఖిగా చూడటానికి వీలవుతుంది. వాక్యము ద్వారా మనము చదివి గ్రహించిన విషయములను ప్రత్యక్షముగా మన జీవితములో చుచుటకు, ఆయనకు సాక్షులుగా మారుటకు దోహదము చేస్తుంది. ఇలా మనము కేవలము తెలుసుకోవటము మాత్రమే కాకుండా ప్రత్యక్షముగా చూడగలిగినప్పుడు ఆ వ్యక్తిమీద confidence తో కూడిన విశ్వాస్యత మనకు లభిస్తుంది. దీనివలన ఆ వ్యక్తియొక్క గుణగణాలు పనిచేయు విధానము మీద మనకు గురి నిలుస్తుంది. వారి గురించి ఎవరైనా మనకు చెడుగా చెప్పినప్పుడు ఆవి నమ్మకుండా మనకు సహాయము చేస్తాయి. అందుకే వాక్యము, ప్రార్థనకు మధ్య ఉన్న సంబంధము విడదీయలేనిది. మనము కేవలము వాక్యము తెలిసినవారు మాత్రమే అయితే ఒక్కోసారి సాతాను వేసే tricks కు పడిపోయే అవకాశము ఉన్నది. మన పితరులు అందరూ కూడా దేవునితో నడిచినప్పుడు ఆయన మనసును అర్థము చేసుకొని మంచి సాక్షులుగా నిలబడగలిగారు. వ్యక్తిగతముగా ప్రార్థనద్వారా దేవుని యెరిగి ఉండటము, ఆయనను చూడటము అనేది మన ఆత్మీయ జీవితములో కీలకమైనది. అప్పుడు మనలను ప్రభువు దగ్గర చేరకుండా అడ్డుకునే మాయోపాయము ఏది పనిచేయదు. మరి దేవుని గురించి నీకు కేవలము అక్షరము ద్వారానే తెలుసా? లేక వ్యక్తిగతంగా కూడా తెలుసా? కేవలము అక్షరము అయితే అది దొరకని రోజున నీ పరిస్థితి ఏమిటి?

స్తుతి

  1. మనకు జీవము అనుగ్రహించి చలించే శక్తిని అనుగ్రహించినందుకు
  2. బలముగా ఎదగటానికి అవసరమైన ఆహారము దయచేసినందుకు
  3. ప్రార్థనద్వారా ఆయనను కలుసుకునే అవకాశము దయచేసినందుకు.
  4. మనలను ఆశీర్వదించి సమృద్ధి, నింపుదల, విస్తరణ ఇచ్చినందుకు

ఆరాధన

  1. మనము లేఖనములను ధ్యానించి వాటిద్వారా కలుగు నిత్యజీవమును కలిగి ఉండటము, అనుభవించటము ద్వారా దేవుని ఆరాధించాలి.
  2. ప్రార్ధనా జీవితమును అలవాటు చేసుకొని అనుదినము ఆయనతో సహవాసము చేయుట, సంభాషణ ద్వారా ఆయనను ఆరాధించాలి
  3. ఆయన అంతట ఆయనే మనలను ఆశీర్వదించేలాగున సంతృప్తికరమైన జీవితము జీవించుటద్వారా ఆయనను ఆరాధించాలి

హెచ్చరిక

  1. నిత్యజీవము సంపాదించకుండా, ప్రార్ధన జీవితము కలిగిలేకుండా ఉండటము అనేది మన ఆత్మలకు మంచిది కాదు.

సత్యము

  1. మనము నిత్యజీవము కలిగి వాక్యమును అనుసరించి జీవించినప్పుడు automatic గా ఆశీర్వాదము పొందుకుంటాము.
  2. జీవము దేవుని ద్వారా మాత్రమే లభిస్తుంది. దానిని మనము సంపాదించుకోలేము
  3. ప్రార్ధన దేవుని వ్యక్తిగతముగా తెలుసుకోవటానికి, మన భారములనుంచి విడుదల పొంది విహరించటానికి దోహదము చేస్తుంది.
  4. ఆత్మీయ జీవితములో వాక్య ధ్యానము, ప్రార్ధన రెండూ కూడా ప్రాముఖ్యమైనవే.