దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).
మొదటి దినమునందు దేవుడు చేసిన క్రియలు ఇప్పటివరకు కూడా సైన్స్ కు అర్థము కాలేదు. wheel ని కనిపెట్టిన తరువాత మనిషి జీవితములో పెనుమార్పులు వచ్చాయి అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. దానిని కనిపెట్టటానికి మనిషికి ఎన్నిసంవత్సరములు పట్టిందో తెలియదు కానీ దేవుడు ఆ విషయాన్నితన సృష్టిద్వారా మొదటి పేజీలోనే తెలియజేశారు. మనిషికి దేవుడి దగ్గర కూర్చుని నేర్చుకునే అలవాటు లేకపోవడం వలన ఈ సమయము, ధనము, జీవితకాలము, నైపుణ్యత వృధా అవుతుంది. అవి circle shapeలో ఉండటము అస్తమయము ఉదయము గమనించినప్పుడు circular motion అనేది మనకు సులభముగా అర్థమవుతుంది. దేవుడు తన సృష్టిద్వారా సైన్సునకు బలము చేకూర్చారే తప్ప దానిని కొట్టివేయలేదు. మనిషి తన స్వంత జ్ఞానమును highlight చేయాలి దేవుని జ్ఞానము కన్నాఅని అనుకున్నప్పుడు దేవునికి, సైన్స్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. శాస్త్రవేత్తలు 1000 సంవత్సరములు కష్టపడి కనిపెట్టిన విషయాన్నిపరిశుద్ధ గ్రంథము ఒక్క నిమిషములో తెలియజేస్తుంది. ఆయన అడిగితే మాట్లాడే దేవుడు. జ్ఞానము మనకు అడిగేకొలది ధారాళముగా దయచేసేవాడు. ఆయన జ్ఞానము ద్వారా సృష్టిలోని మూలవస్తువుల పనితనము గ్రహిస్తే మనిషి ఇంకాఎంతో గొప్ప ఆవిష్కరణలు చేసి ఉండేవాడో. దేవుని జ్ఞానము మనలను ultra modern (safe, secure) age లోనికి నడిపిస్తుంది తప్ప సైన్స్ కాదు
అస్తమయము, ఉదయముల క్రమము మనము గ్రహించినప్పుడు 12 గంటలు ఒక్కొకటి దినమును పంచుకున్నట్లుగా అర్థమవుతుంది. సూర్యునివైపు ఉన్న అన్ని ప్రాంతములు ఒకేసారి వెలుగుతో నింపడటము మరల ఇవి అన్నీ సడెన్ గా చీకటిలోనికి వెళ్లిపోవటము జరుగదు. వెలుగు తూర్పున మొదలు పెట్టి ఒక్కొక్క ప్రాంతమును స్పృశిస్తూ ముందుకు కదులుతుంది. ఆ వెనువెంటనే చీకటి వచ్చిపడిపోదు కానీ అస్తమయమున వచ్చు నీడను మాత్రమే వెంబడిస్తుంది. అది కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతములను స్పృశిస్తూ ముందుకు సాగుతుంది. దీని ద్వారా మనము ఏ స్థితినుంచి ఏ స్థితికి వెళ్ళుచున్నాము అని గ్రహించడానికి తగిన సమయము మనకు దొరుకుతుంది. అందుకే దేవుడు మనుషులను వివేచన అనేది కలిగి ఉండమని పదే పదే చెప్పటము జరిగినది. ఇక్కడ వెలుగు, చీకటి యొక్క పని విధానము ఒకేలా కనిపించినా అవి రెండు సమానము, ఒకటే అనే భ్రమలో మనము ఉండకూడదు. వెలుగు మనలను తాకినప్పుడు ఆ మృదువైన వేడికి మన మనస్సు పులకరించి, మనలను దినచర్యకు సిద్ధంచేస్తుంది. అది దేవుని యొక్క ఆదరణ, దయ, ప్రేమకు సూచన. అయితే చీకటి మనలను తాకినా మనకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు. వెలుగులో భయము ఉండదు కానీ చీకటిలో భయము ఉంటుంది. సాతాను కూడా లోకపరమైన లాభములు చాలా ఇచ్చి దేవుని అవసరము లేదని చెప్తాడు. ఇక్కడే వాడి వెలుగుదూత వేషము మనము గ్రహించాలి. వాటి పద్ధతులు (వెలుగు, చీకటి) లోపలికి వెళ్లిన తరువాత మనిషి జీవనవిధానము మాత్రము ఒకటికాదు అని గ్రహించాలి.
వెలుగు చేత మనము నడిపించబడతాము, చీకటి మనలను ముందుకు కదలనివ్వదు. వెలుగునకు చీకటికి మధ్య ఉన్న తేడాను మనము అర్థము చేసుకోవడానికి దేవుడు మనకు ఎన్ని దినములు అవకాశము ఇచ్చి ఉన్నారు అనేది మనము గ్రహించి ఆ సహనము, దీర్ఘశాంతము వెనుక ఉన్న ఆయన ప్రేమను మనము అర్థము చేసుకోవాలి. మనము అయితే ఎవరికీ ఇన్ని అవకాశములు ఇవ్వము అని మనము గ్రహించాలి. అనుదినము మనలో అందరిమీద తన వెలుగు ప్రసరింప చేయటము ద్వారా దేవుడు మనలను ఎవరిని కూడా మర్చిపోలేదు అని అర్థము అవుతుంది. దేవుడు కావాలి అనుకుంటే పగటి సమయములోనే దగ్గర దగ్గర ప్రాంతములలో వెలుగు లేకుండా చేయగలరు అని మనము తెలుసుకోవాలి. అందుకు ఐగుప్తులో దేవుడు వారికి, ఇశ్రాయేలీయులకు మధ్యచేసిన అద్భుతములే గొప్ప ఉదాహరణ. దీనిని బట్టి దేవుడు ప్రతి రోజూ నిన్నుబలపరుస్తున్నారు. నేను ఉన్నాను అనే ధైర్యము ఇస్తున్నారు. ఆయనను నీవు సంవత్సరముల తరబడి వేచి ఉండేలా చేసినా (అవును సంవత్సరములు అనేదే సరైన పదము. మనము ఒక్కక్కరము రక్షణ పొందడానికి ఎన్నిసంవత్సరములు తీసుకున్నాము ఒకసారి వెనుతిరిగి ఆలోచించండి) ఆయన మాత్రము నీకు 12 గంటల వ్యవధిలోనే అవకాశము ఇస్తూ వచ్చారు. దీనిని బట్టి ఆయనను ఏమని వర్ణించాలి? కృతజ్ఞత ఎలా తెలియజేయాలి???.