దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను  ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)

మన గురించి మనము తెలిసికొనకుండా ఇతరుల గురించి తెలుసుకోవడము కూడా సాధ్యము కాదు. అందుకనే దేవుడు మనము ఎలాగున నిర్మించబడ్డాము, ఎందునిమిత్తము నిర్మించబడ్డాము అనే విషయములు ముందుగా తెలియజేసి, తరువాత మనము చేయవలసిన పని గురించి వివరించటము జరిగినది. ” మనము దేవుని యొక్క జ్ణానమును బట్టి అర్థము చేసుకోవటానికి ప్రయత్నము చేసినపుడు సృష్టిలో ఉన్న ప్రతిదాని వెనుకను గల కారణము, ఉదేశ్యము గ్రహించగలుగుతాము. అలాగున కాకుండా మన జ్ఞానముతో అర్థము చేసుకోవటానికి ప్రయత్నము చేస్తే వాటిని భౌతికముగా అర్థము చేసికొనగలుగుతాము. వాటి యొక్క ఆత్మీయ ఉద్దేశములు మనము గ్రహించలేము. మనము ఏదైనా ఒక Skill అనేది master చేయగలిగినపుడే దానిని Administer చేయగలుగుతాము. అందుకే ఏదైనా ఒక Skill area లో అనుభవము కలిగినవారిని నిష్ణానత కలిగిన వారిని managers గా, అధికారులుగా నియమించడము జరుగుతుంది. చేపల ద్వారా జీవమును వాక్యము నుండి ఎలా గ్రహించాలి అని, పక్షుల ద్వారా ప్రార్ధనా జీవితము, పశువుల ద్వారా దాసుని స్వభావము లేదా సేవ ఎలా చేయాలి అని పురుగుల ద్వారా తగ్గింపు జీవితము ఎలా కలిగి ఉండాలి అనేది మనము master చేయాలి అని దేవుని ఉద్దేశ్యము. అపుడే మనము రాజులుగా మన జీవితమును బాగుగా ఏలగలుగుతాము. లేకపోతే పాపము చేతిలో బానిసలుగానే మిగిలిపోతాము. As JESUS We need to overcome Everything

ఈ విధముగా మనకు రాబోయే రాజ్యమును దేవుడు ముందుగానే సిద్ధపరచి ఉంచారు. ముందుగా మనిషిని చేసి నిరాకారముగా ఉన్న భూమిని అప్పగించకుండా, సమస్తమును సిద్ధముచేసి అతని చేతికి అప్పగించడము జరిగినది. అదే విధముగా దేవుడు మనము పుట్టకముందే మనకోసము అన్నింటిని సిద్ధముచేసి ఉంచుతారు. మనము ఆయనయందు విశ్వాసము ఉంచి, ఆయన చిత్తమును అనుసరించి నడిచిన యెడల వాటిని సంపాదించుకొనగలము. దేవుడు అన్ని సమకూర్చినా కూడా మనము మనకు నచ్చిన కోవలో ప్రయాణము చేయుటవలన “వీటిని సంపాదించుకోలేక పోతున్నాము. వీటి అన్నింటిని అప్పగించి మనముందు పెట్టిన దేవుడు, వాటి జీవితము, లక్షణముల ద్వారా మనము ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు. ఒకవేళ మనకు దేవునితో సంబంధము తెగిపోయి, ఆయన స్వరము వినలేని పక్షమున, మన చుట్టు ఉన్న మిగతా సృష్టిని చూసి అయినా మనము ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అన్ని రకములుగా – దేవుడు తనను గురించిన జ్ఞానమును మన మధ్యలో, Simple గా easy గా అర్థము అయ్యేలా ఉంచటము జరిగినది. దీనిని అర్థము చేసుకోవటానికి మనకు గొప్ప గొప్ప చదువులు అవసరము లేదు. మనకు కేవలము ఇంగిత జ్ఞానము ఉంటే చాలు. ఇలా ఆయన చేసిన కార్యముల వెనుక గల ఉద్దేశ్యమును మనము గ్రహిస్తున్నామా? ఆయన మనకొరకు దాచి ఉంచిన మేలును సంపాదించుకుంటున్నామా?

మనము వాటిని పరిపాలన చేయాలి అంటే వాటిని గురించి న జ్ఞానమును సంపాదించాలి అని ముందు చెప్పుకొన్న విషయమును అనుసరించి మనము చిన్నతనము నుంచి మన చదువులలో బాగముగా ఆ యా subjects గురించి నేర్చుకోవటము అవగాహన కలిగి ఉండటము జరుగుతుంది. పెరిగి పెద్ద అయిన తరువాత వాటిని గురించిన specialization చేసే అవకాశము కూడా ఉన్నది. అందుకే మన subjects అన్ని కూడా దేవుడు చేసిన సృష్టి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి తప్ప వేరొక విధమైన Subjects ఉండవు. ఇవి అన్నీ కూడా రాజుగా మనము కలిగి ఉండవలసిన జ్ఞానము గురించి, వాటిగురించి మనము తెలుసుకొనవలసిన ఆవశ్యకత గురించి, తెలియజేస్తున్నాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు గురించి తెలుసుకోవటానికి Astronomy or space science, వాటి వాటి కక్ష్యల గురించి, వేగముల గురించి maths, ఆరిన నేల గురించి geography, వృక్షముల గురించి botany జంతువుల గురించి లేదా జీవరాసుల గురించి zoology, వాటి కదలికల గురించి physics, భూమిలో ఉన్న లోహముల గురించి Chemistry సముద్రముల గురించి oceanography, మానవ శరీరము గురించి medicine, జీవులు ప్రవర్తన గురించి Psychology, దేవుని క్రియల గురించి, management, చేసిన విధానము mechanics, manufacturing. ఇలా అన్ని మనకు మనము కలిగి ఉండవలసిన జ్ఞానము నిమిత్తము రూపొందించబడినాయి.