దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు ఆకాశంలోను, వాటి మహత్యములోను ఎంతో గొప్పవి అయినప్పటికీ అవి సేవకులుగాను భూమి నిమిత్తము దేవుడు వాటిని ఏర్పాటుచేసిన విధులను తు.చ తప్పకుండా పాటించేవిగాను ఉన్నాయి. దేవుడు వాటిని ఏలుటకు నియమించినా కూడా వాటికి సార్వభౌమాధికారము ఇవ్వలేదు. అవి దేవునికి లోబడి ఉండవలసినదే. ఆయన క్రింద సామంతులవలె పని చేయవలసినదే. ఇది దేవుడు భూమిమీద మనుష్యునికి ఇచ్చిన అధికారము వంటిది. అవి ఎంత గొప్పవి అయినా తగ్గించుకుని సేవ చేసినట్లు మనము కూడా మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండాలి అని చెప్పిన వాక్యమును అనుసరించి మనము దేవునిలో ఎదిగేకొద్దీ దాసుని స్వభావమును ధరించుకొవాలి. మన గొప్పతనము ఎంత పెద్దగా అయ్యాము అనే దానిమీద కాదు కానీ దేవుడు అప్పగించిన పనిని ఎంత sincere గా తగ్గించుకుని చేశాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అవి ఎక్కడా దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఉన్నట్లు మనము కూడా అలానే ఉండాలి. మనలో నేను అనే గర్వము, నాది అనే స్వభావము మరణించి క్రీస్తు కోసమే అన్నట్లుగా బ్రతికితేనే అది సాధ్యము అవుతుంది. నీకు నీవు మరణించనిదే (this should not be viewed as physical death. this has to happen at the heart level to self centeredness) క్రీస్తు నీలోనుండి బ్రతుకుట అసాధ్యము. నీ పరిస్థితి ఎలాగున్నదో సరిచూసుకొనుము.

మన చుట్టూ ఉన్న చాలా గ్రహముల గురించి ఇక్కడ వచనములలో ప్రస్తావించబడలేదు కాబట్టి వాటికి మనము ఏ విధమైన ప్రాధాన్యత ఆపాదించకూడదు. దేవుడు కేవలము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు గురించి వ్రాయంచారు కాబట్టి వాటిని మాత్రమే మనము మన కన్నులతో చూడగలుగుతున్నాము. ఎంతో సుదూరములో ఉన్న నక్షత్రములు కనిపించిన రీతిగా మనకు సమీపములో ఉన్న గ్రహములు కనిపించుటలేదు. అవి చంద్రుని కన్నా పరిమాణములో ఎంతో పెద్దగా ఉన్నను మనము వాటిని చూడలేము. దేవుడు ఏర్పాటు చేసినవే మనకు ప్రాధాన్యము తప్ప దేవుడు లెక్కలోనికి తేనటువంటి వాటికి ఎలాంటి గుర్తింపు , మహిమలు ఆపాదించకూడదు. దేవుడు ఆకాశములో వాటిని decorative items గానే చేసిపెట్టారు తప్ప వాటిద్వారా జ్యోతిష్యము తెలుసుకోమని కాదు. వాటిని చూసి ఆయనను, అంత గొప్పవి చేసిన గొప్ప దేవుని మహత్యమును అర్థము చేసుకుని ఆయనను ఆరాధించాలి తప్ప, వాటి ఆకారములు చూసి వాటిని పూజింపకూడదు. వాటి యొక్క ఆకారములను బట్టి చూస్తే (round circular shape) వాటి విలువ పెద్ద సున్నా (zero) అని మనకు అర్థము అవుతోంది. అందుకేనేమో దేవుడు వాటిని ఆ ఆకారములో సృజించారు. కాబట్టి లేఖనము చెప్పిన విలువ ఇవ్వని వాటిని మనము విలువగా ఎంచకూడదు. నీ జీవితములో అలాంటివి ఏవైనా ఉన్నాయేమో పరిశీలించుకొనుము.

చంద్రుని యొక్క అవసరము ఈ భూమి ఉన్నంతవరకే ఆ తరువాత దేవుడే మనకు వెలుగుగా ఉండి నిరంతరము క్రొత్త ఆకాశము, క్రొత్త భూమియందు ప్రకాశిస్తారు. సూర్యుని యొక్క రూపము మారుతుంది ఏమోకానీ దాని significance మాత్రము పోదు. అది నిరంతరము నిలిచి ఉంటుంది. అందుకే దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చటము జరిగినది. ఆయనకు అంతము లేదు. ఆయన నిరంతరము జీవించువాడు. క్రొత్త సృష్టియందు పాపము అనేది ఇకను నివాసము చేయదు కాబట్టి అక్కడ రాత్రి ఉండదు. చంద్రుని అవసరము లేదు. మనము శరీరములో (భూసంబంధమైన) ఉన్నంతవరకే మనకు విశ్రాంతి అవసరము. క్రొత్త సృష్టినందు మనము ధరించుకొనబోవు మహిమ దేహములకు విశ్రాంతి అవసరము లేదు. దేవుని యందు, ఆయనను ఆరాధించుట యందు మనము విశ్రాంతి పొందుతాము. సంఘము శాశ్వతముగా నిలిచి ఉండేది కాదు. దేవుని మహిమ వేరు. సంఘము యొక్క మహిమ వేరు. మనము దేవునికి ఆపాదించవలసిన గౌరవము మహిమ సంఘమునకు ఆపాదించకూడదు. దేవునితో సమానమైన, అంతకన్నాఎక్కువ గౌరవము సంఘమునకు ఇవ్వరాదు. సంఘము వాక్యానుసారము ప్రవర్తించినంత సేపు లోబడి ఉండాలి. సంఘము లోకముతో స్నేహము చేస్తూ ఉంటే మనము దేవుని పక్షము వహించి సంఘమును సరిదిద్దాలి. అంతేకాని దేవుని మహిమను మనకు నచ్చినట్లుగా మార్చకూడదు. వాక్యపు వెలుగులో సంఘమును చూస్తున్నావా? సంఘము వెలుగులో వాక్యము, దేవుని చూస్తున్నావా?