దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).

పరిశుద్ధ గ్రంథమును మనము జాగ్రత్తగా పరిశీలించినపుడు ఆయన దగ్గరకు వచ్చినవారికి, ఆయనతో నిబంధన చేసినవారికి ఆయన పేరు మార్చినట్లు మనము గమనించగలము. ఆలాగున మార్చబడిన లేదా ఆయన చిత్తానుసారముగా పుట్టకముందే పేరు పెట్టబడిన వారు చాలా గొప్పవ్యక్తులుగా మారారు. వారి జీవితములు ఇన్నివేల సంవత్సరముల తరువాత అయినా జ్ఞాపకములో ఉండేలాగున ఆయన చేశారు. పరిశుద్ధ గ్రంథములో స్థానము ఇవ్వటము ద్వారా కొందరిని, వారి పేర్లు మరపురాకుండా చేయటము ద్వారా కొందరిని (ex: spurgon, john wesley, billy graham, john bunyan…) ఆయన మన ముందు ఉంచారు. మనుషుల ద్వారా పేరు పెట్టబడిన చాలామంది కొంతకాలము తరువాత మరువబడ్డారు. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన పేరు మార్చిన ప్రతి ఒక్కరు pos­itiveగా impact అయ్యారు. ఎవరు కూడా negativeగా మారలేదు. దీనినిబట్టి చూస్తే ఆయన ఎవరికీ అలవోకగా పేరు పెట్టరు అని, దాని వెనుక ఆయన చాలా serious ఉద్దేశ్యములు కలిగి ఉన్నారు అని అర్థము అవుతుంది. దేవుని దగ్గరకు వచ్చి నీ పేరు ఎందుకు నువ్వు గొప్పగా మార్చుకోకూడదు? ఆయన పెట్టిన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. నీ పేరు వెలుగునకు మాదిరిగా ఉండేలా నీవు ఎంత ప్రయత్నించినా మార్చుకొనలేవు. అది కేవలము ఆయనకు మాత్రమే సాధ్యము

ఈ లోకములో మనుషులు తమ పేరును గొప్ప చేసుకోవటము కోసము రకరకాల పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. అవసరమైతే ఆ క్రమములో ఎదుటివారికి నష్టము సంభవించినా కూడా పెద్దగా పట్టించుకోరు. కొంతమంది నియంతల జీవితచరిత్ర చూసినప్పుడు ఈ విషయము అర్థము ఆవుతుంది. అయితే దేవుని పద్ధతి అందుకు విరుద్ధముగా మనము చూడగలము. ఆయన దగ్గరకు వచ్చిన వారి పేరును ఘనపరిచే క్రమములో ఎక్కడా ఇతరులకు ఇబ్బంది కలిగించరు. అవసరము అయితే ఆ యా వ్యక్తుల నష్టము, బాధ సహించి త్యాగము చేశారు. వారి ప్రాణములను సహితము వదులుకున్నారు. చివరకు వారు అందరిచేత అంగీకరించబడే విధముగా చేస్తారు. ఆయన దగ్గరకు వచ్చి విధేయులుగా ఉన్నవారి పేరులకు మచ్చ అనేది అంటుకోవటము ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఆయన దగ్గరకు రాకముందు వారిమీద ఉన్న మచ్చలను కూడా తీసివేసి పరిశుద్ధ పరచటము జరిగినది. ఒకవేళ నీ పేరునకు ఇప్పటికీ ఏదైనా కళంకము, మచ్చ తెచ్చుకుని ఉన్నా భయపడకు. ఆయనకు నేను ఉపయోగపడను అనుకోకు. నీవు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లినా నీ పేరునకు ఉన్న మచ్చలు అన్నిటినీ శుభ్రపరిచి, నీ వ్యక్తిత్వము మార్చి, నీ పేరు నిత్యనూతనముగా నిత్యము నిలిచి ఉండేలా చేయగలరు. ఆయన మార్గము సత్యము కలిగినది. సమస్తము వెలుగు మార్గమే. నిన్నుdignified way లో ఎవరు వేలెత్తి చూపించటానికి వీలులేకుండా గొప్ప చేస్తారు. అది మనకు గొప్ప ఆశీర్వాదము.

అస్తమయమును, ఉదయమును కలుగగా ఒక దినమాయెను అనేమాట మనకు ఒకింత ఆశ్చర్యము కలిగించవచ్చు. అందులో ఒకటి సూర్యుడు-చంద్రుడు లేకుండా ఇది ఎలా సాధ్యము అని. రెండు ఉదయము నుంచి సాయంత్రము వరకుకదా మనము ఒక దినమును లెక్కించేది అని. అయితే యూదుల యొక్క ఆచారము ప్రకారము వారు దినమును సాయంత్రము నుంచి మరుసటి రోజు సాయంత్రమునకు లెక్కగడతారు. అందుకే మోషే ఆదికాండము వ్రాసినప్పుడు ఆ విధముగా వ్రాసి ఉంటాడు అని చాలామంది పండితుల అభిప్రాయము. అయితే అసలు రచయిత పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనము మరిచిపోకూడదు. ఆయన ఏ ఉద్దేశ్యములతో మనకు ఏమి తెలియజేయాలి అని వ్రాయించారు అనేది ఆలోచించాలి. దేవుడు అంధకారములోనుండి తన పని అనేది మొదలుపెట్టి వెలుగు చేయటము జరిగినది. ఆయన పని జరిగించినపుడు ఫలితములు ఎలాఉంటాయి అనే దానికి ఇది ఒక నిదర్శనము. చీకటిలో ఉన్న ఆత్మతో ఆయన కార్యము చేయటము మొదలుపెట్టినప్పుడు ఆ ఆత్మ వెలుగులోనికి నడిపించబడేంత వరకు ఆయన పని కొనసాగుతుంది. చీకటినుంచి వెలుగునకు తప్ప వెలుగునుంచి చీకటికి అది మారదు. దాని ప్రారంభము వేదనతో మొదలు అయ్యి అంతము సంతోషముగా ఉంటుంది. చూడచక్కనిదిగా, మెచ్చుకోవటానికి ఏమీలేకుండా ప్రారంభించబడి అధిక మహిమతోను చూడాలి అనిపించే అందముతో ముగుస్తుంది.