మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).

మనము అందరము కూడా జీవితములో ఏది కొన్న highest quality ఉండాలి value for money అని ఆశిస్తాము. ఆ వస్తువును అన్నివిధములుగా పరిశీలన చేసిన తరువాతనే కొనుగోలు చేస్తాము. అలానే దేవుడు కూడా తన కొరకు ఏర్పరుచుకొన్న వారు, వెలలేని, కట్టలేని తన రక్తముతో, కలంకములేని, నిష్కళంకమైన దానితో కొన్నవారు, అలా ఉండాలి అని కోరుకోవడటములో, వారి నుంచి high quality ఆశించుటములో ఏమాత్రమూ తప్పు లేదు కద. ఎందుకూ పనికిరాని ధనమునకె, చిమ్మెటకొట్టి నశించిపోయే దానికే మనము అంత ఆశించిన యెడల మరి ఎప్పటికీ నిలిచి ఉండే ఆయన రక్తమనకు ఆయన ఇంక ఎంత ఆశించాలి. దేవుడు మన విషయములో ఏదైతే పద్ధతి/వైఖరి అవలంబిస్తూ ఉన్నారో మనము కూడా అదే పద్ధతి/వైఖరి అవలంబిస్తున్నాము అనే విషయము మర్చిపోకూడదు. మనము మంచి quality కలిగిన వస్తువు సంపాదించినప్పుడు ఎలా అయితే ఆనందిస్తామో అలానే దేవుడు కూడా మన విషయములో ఆనందిస్తారు. ఆయన మననుంచి దానిని ఆశించినప్పుడు మనము సణుగుకోవటము అనేది సమంజసము కాదు. మన విషయములో న్యాయము అనుకున్నది ఆయన విషయములో అన్యాయముగా భావించకూడదు. ఆ quality standard ఎంత highest గా ఉంటుందో తెలియజేయటానికి ఆకాశము అంత ఎత్తున ఉన్నది.

దేవుడు ఈ విధముగా వేరుపరచటము అనేది మొదటిసారిగా ఇజ్రాయేలీయులను ప్రత్యేక జనముగాను, దేశముగాను ఏర్పరచిన విషయములో ప్రస్ఫుటముగా చూడగలము. వారికి నియమించిన విధివిధానములు కూడా మిగతా ప్రజల పద్ధతులకన్నా చాలా భిన్నముగాను, ఉన్నతనము గాను ఉన్నాయి. ఆయన ఎన్నుకున్న వ్యక్తుల యొక్క జీవితములను చూసినా కూడా ఆ standards అనేవి చాలా ఉన్నతముగా ఉండటము మనము గమనించగలము. వాటిద్వారా సాధారణమైనవారి జీవితములు దేవుని ద్వారా ఆసాధారణముగా మార్చబడ్డాయి. అనేక వేలమందికి మాదిరికరముగా ఉన్నాయి. వారు మరణించి వేల సంవత్సరములు గడిచినా కూడా నాగరికత వారి దినములతో పోల్చుకుంటే సమూలమైన మార్పు చెందినాకూడా ఇంకా మనము వారినుంచి నేర్చుకుంటున్నాము. వారి విధేయత, దేవుని కొరకు వారు ప్రత్యేకించుకొనిన తీరు, లోకమును యెడబాసి వారు చేసిన త్యాగములు ఇంకా మనకు పెను సవాలుగానే ఉన్నాయి. ఇశ్రాయేలీయులలో సహితము వారు దారి తప్పినప్పుడు తనకోసము నిలబడినవారిని ప్రత్యేకించారు తప్ప తన స్వకీయజనము అని వారితో ఎక్కడా రాజీపడలేదు. ఆయన వేరుపరచు విధానము ఆ రకముగా ఉంటుంది. పరలోక సంబంధులు ఎక్కడ ఉన్నా అలానే ఆయన ప్రత్యేకపరుస్తారు. అది స్వంత కుటుంబమునుంచి అయినా కావచ్చు. మరి ఎప్పుడూ quality కోసం తపించే నీవు ఆయనతో ఎందుకు చేరకూడదు

ఈ విధముగా వేరుపడటము, మంచిది కాని దానికి దూరముగా ఉండటము, వారికి తెలుసు అనే భ్రమలో మనుష్యులు అందరు జీవిస్తూ ఉంటారు. అయితే వారు లోకసంబంధమైన విషయములలో మాత్రమే తమకు నష్టము, లాభము బేరీజు వేసుకొని వాటి విషయములలో మాత్రమే ఆలాగున ఉంటారు. పరలోక సంబంధమైన విషయములలో సరిగా గుర్తించటము వారికి చేతకాదు. లోకములో ఉన్న విగ్రహములను ఆరాధించే మేము వెలుగులో నడుస్తున్నాము అనుకుంటారు. అయితే వారు నిజమైన వెలుగును గుర్తించి దాన్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే మరలా దేవుడు క్రొత్తగా వెలుగును సృష్టించనేల. లోకములో దైవత్వమునకు సంబంధించిన మాయలనుంచి సాతాను కల్పించిన గ్రుడ్డితనము నుంచి వారు వేరుకాగలిగితే మరల 6వ వచనములో వేరుచేసి అంత దూరము కల్పించేలా, అది అంధకారము అని 2వ వచనములో చెప్పనేల. దీనినిబట్టి దేవుడు మన విషయములో intervene అవకపోతే మనము ఎప్పటికీ గుర్తించలేము అనే విషయము స్పష్టముగా అర్థము అవుతుంది. ఒకని పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించితేనే తప్ప వాడు రక్షణ పొందలేడు అని తెలియజేస్తుంది. అందుకే దేవుడే స్వయముగా లేఖనములు/సత్యమును/జీవమును/వెలుగును dictate చేయవలసి వచ్చినది. లేకపోతే మనుషులు తమ అంతట తామే వ్రాసి ఉండేవారు. అందుకే దేవుడే విశాలము ద్వారా వేరుపరచటము జరిగినది.