దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)
Verse 24-25 praise
- ఆయన శిష్యులుగా మనలను సిద్దము చేసి ఆయన సేవలో వాడుకుంటున్నందుకు
- మనకు పరిచర్యలో అవసరమైన సమస్త తర్పీదును ఇస్తున్నందుకు
- మనకు మంచి కాపరిగా ఉంది సంరక్షిస్తున్నందుకు
Verse 24-25 Worship
- మనము సాధు చేయబడుటకు అంగీకరించి, తర్ఫీదు విషయములో సంపూర్ణమైన సహకారము అందించుట ద్వారా దేవుని ఆరాధించాలి.
- ఆయన మనకు అప్పగించిన కార్యమును సంపూర్తి చేసి (అందరికీ సహకరిస్తూ) ఆయన చిత్తము నెరవేర్చుట ద్వారా దేవుని రాజ్య విస్తరణ చేసి దేవుని ఆరాధించాలి.
Verses 24-25 Caution
- మనము ఆయనకు సహకారులుగా మారకపోతే దేవుని రాజ్య విస్తరణ కుంటుపడుతుంది
- మనము ఇతరులతో సహకరించకపోతే దేవుని పనికి ఆటంకము కలుగుతుంది
- విశ్రాంతి లేకుండా, కుటుంబమును పట్టించుకోకుండా పని చేయకూడదు
Verses 24-25 Truth
- దేవుని సేవ చేయుట మంచి విషయము
- కేవలము క్రియల ద్వారా మాత్రమే ఆశీర్వాదము, రక్షణ పొందుకొనలేము