దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)

దేవుని యొక్క సంరక్షణలో మనము అన్నీ విధాలా సంతోషముగా ఉంటాము అని లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము తెలియజేయబడినది. ఆయన మనకు మంచి కాపరి అవసరము అయితే మన క్షేమము కొరకు తన ప్రాణమును సహితము ధారపోస్తాడు అని చెప్పబడినది. పచ్చిక బయళ్ళు మనకు ఆహారముగాను, శాంతికరమైన జలములు మన దాహమును తీరుస్తూ, సమాధానము మనకు శయన స్థానముగాను ఉంటాయి. సాధు చేయబడిన జీవులలో ఏదీ కూడా చెడునకు గుర్తుగా పరిశుద్ద గ్రంధములో చూపబడలేదు. ఆయన సంరక్షణ, పోషణ అంతా అద్భుతముగా ఉంటాయి. అడవి జంతువులు, సాధు చేయబడినవి అనేకములు ఆయన చెడునకు గుర్తుగా ఉపయోగించారు. దీనిని బట్టి ఆయన సంరక్షణలో మనము లేకపోతే పరిస్థితి ఏమిటి అనేది కూడా అర్ధము చేసుకోవాలి. ఈరోజే ఆయన సంరక్షణలోనికి వెళ్లి ఆయనకు ఉపయోగపడే సాధనముగాను, రాజకీయ మకుటముగాను మారదాము. ఆయన కొర్కౌ పనిచేసేవారిని ఆయన ఎలా కాపాడారు అనే అనేక సాక్ష్యములు మనకు పరిశుద్ద గ్రంధము నిండా ఉన్నాయి. ఆయన మందలో మనము, మన సంతానము ఉండేలాగున అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి. పాత స్వభావమునకు మరణించి నూతన స్వభావమునకు తిరిగి జన్మించాలి.

పశువులు జీవము కలిగి ఉన్నాకూడా దేవుని వలన ఆశీర్వచనము పొందుకొనలేదు అని ఈ వచనములు మనకు స్పస్టము చేస్తున్నాయి. దీనిని బట్టి జంతువులు శాపగ్రస్తమైనవి అనే భావనలో మనము ఉండకూడదు. ఎవరినీ కూడా దేవుడు ఊరికే శపించరు అని లేఖనముల ద్వారా మనకు అర్ధము అవుతుంది. ఇక్కడ దేవుడు కొన్ని విషయములను స్పస్టము చేస్తున్నారు. దేవునికి సహకరించి, పనిలో సహాయము చేయుట అనే మంచి పనుల ద్వారా దేవుని ఆశీర్వాదము లభించదు. అవి ఆయన మనకొరకు చేసిన త్యాగమును, ఆయన కనుపరచిన ప్రేమను గుర్తించి, మన కనీస భాద్యతగా,కృతజ్ణతతో, ప్రేమ పూర్వకముగా చేయాలి. ఏదో వస్తుంది అని ఆశించి చేయకూడదు. ఆశీర్వాదము ఐడి నాలుగవ దినమున చెప్పబడినట్లు వాక్యానుసారమైన, ప్రార్థన జీవితము వలననే లభిస్తుంది. దేవుడు జంతువుల విషయములో అవి విస్తరించాలి అని, సమృద్దిగా నిండి ఉండాలి అని పలుకలేదు. అంటే దాని అర్ధము సేవ చేయటము మంచిది కాదు అని కాదు. ఆయన మనలను సేవకుల కన్నా కూడా స్నేహితులుగాను, కుమారులనుగాను, కుమార్తెలగాను,నీతిమంతులగాను చూడాలి అని అనుకుంటున్నారు. పనివారుగా మనము మిగిలిపోవాలి అని ఆయన కోరుకొనటము లేదు. ఆయన స్వారూప్యము లోనికి రావాలి అనేది ఆయన చిరకాల వాంఛ. ప్రభువు చెప్పినట్లు ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మనలను పోషిస్తూ ఆయనే మనకు నిజమైన పరిచారకునిగా ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తించు. ఎంత పని చేసినా దీవెన రావతము లేదు అని బాధపడకు. అది స్వార్ధము అవుతుంది. ఆయన నీకు చేసిన పని ముందు నీవు ఆయనకు చేసినది ఎంత? ఆలోచించు.

ప్రాకు పురుగులను కూడా సృజించటము మాత్రమే కాకుండా వాటిని ఇక్కడ ప్రస్తావించటమును బట్టి ఆయనకు చిన్నవాటి మీద ఉన్న శ్రద్ధకు సహితము అద్దము పడుతుంది. మన పరిమాణము ఎంత ఉన్నది అనేది ముఖ్యము కాదు. ఆయన ఇచ్చిన పనిని ఎలా చేస్తున్నాము అనేది ముఖ్యము. చీమలకు ఆయన లేఖనములలో ఇచ్చిన గౌరవ స్థానము మన అందరికీ కూడా తెలిసినదే. పరిశుద్ద గ్రంధములో ఘనమైన, ఘనహీనమైన పాత్రలు రెండూ ఆయన చేసి వాడుకుంటారు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీవు ఎలాంటి పాత్రవు అనే విషయమై చింత, అసూయ వలదు. ఆయన పరిచర్యలో వాడబడుతున్నందుకు సంతోషించు. ప్రాకు పురుగుల ద్వారా మనము తగ్గింపు నేర్చుకోవాలి. అవి తమ పాదములు అన్నీ కూడా నేలమీద మోపి తల క్రిందకు వంచుకుని పనిచేస్తాయి. అలానే మనము కూడా మంటివారము, పురుగు వంటివారము అని గుర్తించి మన స్థానము ఎరిగి ప్రభువు దగ్గర నేర్చుకోవాలి.

జంతువులకు ఆత్మ లేదు. అవి మరణించిన తరువాత తిరిగి మట్టిలో కలిసిపోతాయి. కేవలము క్రియల మూలమున రక్షణ కలుగదు అని, ఆత్మ రక్షింపబడదు అని కూడా దేవుడు దీనిద్వారా తెలియజేస్తున్నారు. క్రియలు కేవలము ఒక భాగము మాత్రమే. మన జీవితములో అవే ultimate కాదు. అసలైనది మారుమనస్సు, పశ్చాత్తాపము, దేవుని నీతి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణత లోనికి మారటము.