దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. (1:29-30)

చెట్టు తన ఫలముల యొక్క భారమును మోసినట్లు, అవి తనలో ఉన్న తియ్యదనాన్ని సంగ్రహించినట్లు , దేవుడు కూడా మన భారము వహిస్తున్నారు . ఆయనలో ఉన్న తియ్యదనము వల్లనే మన జీవితము కూడా రుచిని సంతరించుకుంటుంది. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరని కూడా దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. దానిని బట్టి మనము ఆ చెట్టుతో అంటుకట్టబడి లేకపోతే ఆదిలోనే రాలిపోయి పడిపోయే ప్రమాదము ఉన్నది. ఎదిగి, పరిపక్వతకు రావటానికి సమయము పడుతుంది అని గ్రహించి ఒపికతో ఎదురుచూడాలి. మనము అడిగినవి జరగడము లేదు అని జీవితములో ఆశించిన మార్పులు వేగముగా రావడములేదు అని దేవుని నుంచి వేరవకూడదు. ఫలము ఎదిగేకొద్దీ చెట్టునకు బరువు కూడా పెరుగుతుంది. అయినా చెట్టు వాటిని భరించినట్లు, మన దేవుడు కూడా ఎదుగుదలలో మనము ఆయనమీద పెట్టిన భారములు అన్నీ కూడా మోస్తున్నారు. మనము ఎన్ని ప్రార్టనా విన్నపములు ఇస్తున్నామో మనకందరికి తెలిసిన విషయమే. అకారణముగా వీచే గాలికి కూడా కాయలు రాలుతూ ఉంటాయి. అలాగున శోధనల ద్వారా మన జీవితములో గాలులు వీస్తూ ఉంటాయి. అలాంటి సమయములో కూడా దేవుని నుంచి మనము దూరము కాకూడదు. ఒక మంచి పండుగా మనము పరిపక్వత చెందినపుడు, దానిని విత్తనముగా ఉపయోగించి మరొక చెట్టు ఎదగటానికి ఉపయోగపడుతుంది. అలానే మనము దేవునిలో పరిపక్వత చెందినప్పుడు, మన ద్వారా దేవుడు కొన్ని కుటుంబములను, దేవుని అనుసరించి నడుచుకునే వారిని తీసుకుని రావడము జరుగుతుంది. దేవుడు తన అరచేతుల మీద నిన్ను ఎలా మోస్తున్నది నీవు గ్రహించావా? నీవు ఎదిగి ఫలిస్తూ ఉంటే ఎంతటి బరువును అయినా మోయటానికి ఆయన సిద్దముగా ఉన్నాడు. నీద్వారా ఆయన మరికొన్ని కుటుంబములను తయారు చేయటానికి ఉపయోగపడుతున్నావా?

Verses 29-30 praise

  • మనకు ప్రత్యేకమైన విత్తనములతో కూడిన ఆహారము దయచేసినందుకు
  • సమస్త జీవరాసులకు కూడా పోషణ అనుగ్రహించినందుకు
  • మనకు ఆహారములో ఇచ్చిన వెరైటీ కొరకు
  • మన ఆత్మకు ఆహారమైన ఆయన వాక్యమును ఏ సమయములో అయినా అందుబాటులో ఉంచినందుకు

Verses 29-30 worship

  • దేవుని యొక్క వాక్యమును అనుదినము ఆహారమువలె భుజిస్తూ, ఆయన మనలో ఉంచిన తన స్వరూపమును, పోలికెను కాపాడుకొనుట ద్వారా దేవునిని ఆరాధించాలి.
  • మన జీవితములో పరిపక్వత సాదించి దానిద్వారా మరికొంత మంది దేవుని దగ్గరకు వచ్చి ఆయనను తెలుసుకునేలా, రుచి చూసేలా చేసి దేవునిని ఆరాధించాలి.

Verses 29-30 Caution

  • మన జీవితములో మనము ఫలించకపోతే రాలిపోయే ప్రమాదము ఉన్నది.