మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).
స్తుతి
- లోకమునుండి మనలను వేరుపరచి తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నందుకు
- మనయెడల ఉన్నతమైన (ఆకాశమంత) తలంపులు, ప్రణాళికలు కలిగి ఉన్నందుకు
- మనకోసము పరలోకములో అద్భుతమైన నివాసస్థలము సిద్ధము చేసినందుకు
- ఆయన నివాసము ఉన్న ప్రదేశములో మనకు స్థానము కల్పించినందుకు
- ఆకాశమునుండి వచ్చి ఏదీ మనకు ప్రమాదము కలిగించకుండా రక్షణ ఏర్పాటు చేసినందుకు
- తన పరివారుమైన దేవదూతలను మనకు పరిచర్య చేయటానికి ఇచ్చినందుకు
- మనలను ఎదుర్కొనుటకు ఆయన పరివారముతో ఆకాశము మధ్యకు వస్తున్నందుకు
- ఆకాశములో మనము భవిష్యత్తులో కనిపెట్టే ప్రయోగాల కొరకు ఆలవాలముగా తీర్చిదిద్దినందుకు
ఆరాధన
- మనము లోకమును దాని పద్ధతులు, పోకడలనుంచి వేరుపడి ఆయన కొరకు ప్రతిష్టించుకొనుట ద్వారా ఆయనను ఆరాధించాలి
- దేవుని విషయములో కూడా మనము ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఆయనను సేవించాలి
హెచ్చరికలు
- మనము లోకమునుండి వేరయి ఆయన పక్షమున నిలవకపోతే ఆకాశమునుండి వచ్చు తీర్పునకు, శిక్షకు గురి కావలసివస్తుంది
సత్యములు
- దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని అందరికి మాదిరిగా చూపించాలి అని కోరుకుంటున్నారు
- దేవుడు తనను సేవించే వారి ప్రవర్తన విషయములో రాజీపడడు
- సత్యమును అనుసరించి నడిచినప్పుడు మనలను అమితంగా ప్రేమించిన దేవుడు మనము దుర్మార్గతను అనుసరిస్తే శిక్షిస్తారు
- దేవుడు మనకు హాని కలిగించే వాటిని మెచ్చుకొనడు
- దేవుడు మనలను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు