దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).

చేపలు ఎదురు ఈదటమే కాకుండా తమ పిల్లలను కూడా అదేలోతులో పెంచి వాటిప్రక్కనే ఉండి నేర్పిస్తాయి. వాటి పిల్లల పోషణ బాధ్యత వేరేవాటికి అప్పగించవు. ఎల్లప్పుడూ nurture చేస్తూ కంటికిరెప్పలా కాపాడుకుంటాయి. అలానే మనము కూడా మన పిల్లలను పెంచి పోషించాలి. కేవలము వారు బయట ప్రపంచములో చదువు ద్వారా నేర్చుకుని తెలుసుకుంటారు అని విడిచిపెట్టకూడదు. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు అనే విషయము మర్చిపోకూడదు. చిన్నతనము నుంచే వారు నడవవలసిన త్రోవను వారికి బోధించమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ముందుగా చేపలవలె మనము అనుసరించి చూపించాలి. మనము చేయకుండా వారిని హెచ్చరిస్తూ ఉంటే అది వారు బలవంతముగా feel అయి నామకార్థముగా మన సంతృప్తికొరకు జీవిస్తారు తప్ప మనస్ఫూర్తిగా దేనిని వెంబడించరు. అది ఎప్పటికీ కూడా సత్ఫలితము ఇవ్వదు. ముందుగా మనము దేవునిలో ఉన్న ఆనందము, భద్రత వారికి అనుభవ పూర్వకముగా తెలియజేసినప్పుడు మాత్రమే వారు అనుసరించుటకు పురికొల్పబడతారు. మనము మన పిల్లలతో ఎక్కువ సమయము గడపాలి. వారికి అన్నీ దగ్గర ఉండి విపులముగా చెప్పి నేర్పించాలి. మనము బోధించేది ప్రతిదీ వాక్యానుసారముగా ఉండాలి తప్ప మన స్వంత జ్ఞానము ఉండరాదు. మరి నువ్వు నీ పిల్లలకు నేర్పించటానికి నేర్చుకుంటున్నావా? లేకపోతే నీ పిల్లలు కూడా నీలానే తయారు అవ్వాలి అని మెదలకుండా కూర్చుంటున్నావా?

ఈ విధముగా పెద్ద చేపల సంరక్షణలో పెరుగుతున్న చిన్న చేపలు తాము ఎదిగి పెద్దవిగా మారి బలము పొందుకునేంత వరకు మిగతా చిన్న చేపలతో కలసి గుంపుగా నివాసము చేస్తాయి. అవి బాగా పెరిగి పెద్దవి అయ్యాకే వంటరిగా సంచరించటము అలవాటు చేసుకుంటాయి. అలా గుంపులో కలిసి ఉండటము వలన ఏదైనా పెద్ద చేప వాటిమీద దాడి చేయటానికి ప్రయత్నము చేసినప్పుడు అవి అన్ని ఒకచోట చేరి ఆ చేపను భయపెట్టి తమని తాము రక్షించుకుంటాయి. అలా మనము కూడా మిగతా విశ్వాసులతో కలిసిమెలిసి జీవించాలి. అప్పుడు మన ఐకమత్యము వలన శత్రువు మనమీద దాడిచేయటానికి అవకాశము ఉండదు. నేను ఎవరితోనూ కలవను, ఒంటరిగానే ఎదుగుతాను అనే concept పరిశుద్ధ గ్రంథము కూడా సమర్థించదు. ప్రభువైన యేసుక్రీస్తువారు తన శిష్యులను కూడా ఒంటరిగాకాక ఇద్దరు ఇద్దరుగా పంపినారు. మనము సాటి విశ్వాసులతో ఎప్పుడూ సహవాసము కలిగిఉండాలి. పరిశుద్ధ గ్రంథము team work, collaboration నే ఎప్పుడూ promote చేస్తుంది తప్ప solo అనేది encourage చేయలేదు. ఇతరులతో కలసి ఉండేలాగున మనలను మనము adjust చేసుకుంటూ flexible గా ఉండాలి. దేవుని యొక్క వాక్యము, ప్రేమ ద్వారా అందరమూ అంటుకట్టబడి ఉండాలి. మరి నీవు సాటి విశ్వాసులతో సత్ సంభందములు కలిగి ఉన్నావా? అపరిచితుడులా ఉన్నావా?

నోవహు దినములలో దేవుని సృష్టిలో పొడినేలమీద నాసికా రంధ్రములలో జీవవాయువు గల సమస్తమును నశించాయి తప్ప జలములలో ఉన్న చేపలు మాత్రము మరణించలేదు. మొత్తము మీద ఇవి మాత్రమే బ్రతికి తీర్పునుంచి తప్పించుకున్నాయి. అది ఎందుకు అని మనము ఆలోచనచేస్తే దేవుని వాక్కును అనుసరించి నిత్యజీవము కలిగి ఉండడమే. అలాంటివారికి తీర్పు ఉండదు అని, నాశనము రాదు అని దేవుడు ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టముగా తెలియజేస్తున్నారు. అందుకే లేఖనములలో సమస్తమును ఇచ్చి/అమ్మివేసి అయినా నిత్యజీవము సంపాదించుకొనుము అని వ్రాయబడి ఉన్నది. చేప పూర్తిగా నీటిలో నివసించి జీవించినట్లు మనము కూడా దేవుని యొక్క వాక్యములో సంపూర్ణముగా మునిగి జీవించాలి. అదే మనకు ఎల్లవేళలా రక్షణ కల్పిస్తుంది. మనము నీటిలో ఉన్న చేప రక్షణ పొందిన ఆత్మకు సాదృశ్యముగా చెప్పుకున్నాము కాబట్టి ప్రభువు వారిని కాపాడుతారు, నాశనము కావు అని కూడా అర్థము అవుతుంది. మనము ఈ లోకంలో వాక్యము అనుసరించి సంపాదించుకోవలసిన నిజమైన ఆశీర్వాదము ఇదే. అంతేకానీ లోకపరమైన దీవెనలను prosperity of ఆస్తులు, డబ్బు, పలుకుబడి కాదు. నిజమైన దీవెన ఆత్మ సంబంధమైనది తప్ప భూసంబంధమైనది కాదు. లేఖనములో ఎన్నో దృష్టాంతములు దీనికి సాక్ష్యము ఇస్తున్నాయి. మరి నీవు నిత్యజీవము సంపాదించుకుని నీ ఆత్మను భద్రము చేసుకున్నావా?