దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).

స్తుతి

 1. దేవుడు పేరు ద్వారా మనకు ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు కొరకు
 2. పేరుల ద్వారా మనము నడవవలసిన త్రోవను, నడవకూడని త్రోవను, పొందుకోవలసిన వాటిని, విడిచిపెట్టవలసిన వాటిని మనకు తెలియజేసినందుకు
 3. పేరు ద్వారా మనయెడల గొప్ప ప్రణాళిక ఉద్దేశ్యము కలిగి ఉన్నందుకు
 4. మన నామము ఘనత పొందేలా అన్నిఅవకాశములు ఇచ్చినందుకు
 5. మన పేరు నశించకూడదు అని సిలువలో శ్రమపడి ఘోర మరణము పొందినందుకు
 6. మనలను మరిచిపోకుండా మన పేరును తన అరచేతిలో చెక్కుకున్నందుకు
 7. మన జీవితములను ఉదయపు వెలుగుతో నింపినందుకు
 8. అస్తమయమందు మన చేతిని పట్టుకుని వెలుగు వచ్చేంతవరకు విడిచిపెట్దనందుకు
 9. మన జీవితములో ఎలా లెక్కించటము అనేది నేర్పినందుకు
 10. భూమిని సంపూర్ణముగా చీకటికి అప్పగించనందుకు
 11. మనతో ఎల్లప్పుడూ సహవాసము చేయాలి అనే ఆయన ఆరాటము కొరకు

ఆరాధన

 1. మన జీవితమనకు పెట్టిన పేరు సార్ధకము అయ్యేలా ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చి ఆయనను ఆరాధించాలి
 2. ఆయన మనలను ప్రేమించినట్లుగానే మనము కూడా వెలుగులో ఉండి తిరిగి ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆరాధించాలి

హెచ్చరిక

 1. మన జీవితములో ఆయన చిత్తమును ఎరిగి దానిని వెంబడించకపోతే మన పేరు నిందకు, ఘనహీనతకు ఆస్పదముగా మారుతుంది
 2. ఆయనకు సహకరించకపోతే మనము సంపూర్ణత సాధించలేము
 3. ఆయన ఇచ్చిన సమయములో ఏ రోజు కూడా వృధా చేసుకొనకూడదు

సత్యము

 1. దేవుని దృష్టిలో మనము అందరము విలువ కలిగినవారము
 2. భూమిమీద మనుషుల విషయములో ఎలా ఉన్నా ఆయన దగ్గర మనకు ప్రత్యేకమైన unique గుర్తింపు ఉంది
 3. మనలో వెలుగు సంపూర్ణత సాధించేవరకు ఆయన మొదలుపెట్టిన పనిని ముగించరు
 4. మనము జీవించే ప్రతి దినము కూడా సరిచేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము, అవకాశము.
 5. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు
 6. మన అందరికీ దేవుని ద్వారా గొప్ప నిరీక్షణ కలదు
 7. ఆయన ఎప్పుడూ అంధకారములో మనలను విడువడు
 8. దేవుని దృష్టిలో పేరునకు చాలా విలువ ఉన్నది