దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను  ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)

దేవుడు నరులకు ఇచ్చిన ఆశీర్వాదము చూసినప్పుడు అది చేపలకును, పక్షులకును ఇచ్చిన దీవెనను పోలి ఉన్నది. సృష్టి కార్యమును మనము మొత్తముగా పరిశీలన చేసినప్పుడు కేవలము చేపలు, పక్షులు, మనుష్యులు తప్ప మరి ఏమి కూడా దేవుని చేత ఆశీర్వాదము పొందినట్లు కనిపించదు. మిగతావాటి విషయములో అది మంచిది అని దేవుడు చూశారే తప్ప వాటిని ప్రత్యేకముగా ఆశీర్వదించలేదు. దీనిని బట్టి వాక్యములో జీవము గ్రహించుట, ప్రార్థన, ఆయన స్వరూపములోనికి మారండి అనునవి మాత్రమే మనకు ఆశీర్వాదము తెస్తాయి అని అర్థము అవుతుంది. కాని ఆయన స్వారూప్యము, పోలికె అక్కడితో ఆగిపోకుండా మనకు అధికారమును కూడా తెచ్చిపెట్టినది. ఈ రోజున ఇలాంటి మార్పు అనేది జీవితములో లేకుండా కేవలము ఆశీర్వాదముల మీద మాత్రమే Focus చేసే బోధల విషయమై జగ్రత్తగా ఉండాలి. అంతేగాక గ్రహముల వలన, నక్షత్రముల వలన, వృక్షముల వలన, పశువులను అందించుట వలన మనకు ఆశీర్వాదము రాదు అనే విషయము కూడా స్పష్టమవుతూ ఉంది. వీటికి దీవెన అనేది లేనప్పుడు అవి మనకు ఏలాగున ఇవ్వగలవు. మన జీవితము నూతనపరచబడి, మారు మనస్సు అనుభవము ద్వారా born again అయినప్పుడే నిజమైన దేవుని దీవెన లభిస్తుంది. మిగిలినవి అన్ని కూడా ఉంటే మంచిది అన్నట్లు ఉండేవే. నీవు కేవలము దీవెన కోసమే దేవుని దగ్గరకు వచ్చావా? నీ మనస్సు, జీవితము మార్చుకోవటానికి వచ్చావా?

దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదము మనము గమనించినప్పుడు మన విషయములో దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నట్లు అర్థము అవుతుంది. ఫలించాలి అన్న కోరికను బట్టి మనము సంతానము కలిగి ఉండాలి. గర్భపలము యెహోవా ఇచ్చు దానము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అలానే గొడ్రాలితనము శాపము వలన కలుగుతుంది అని కూడా తెలియజేస్తుంది. ఈ దీవెనను బట్టి దేవుడు మనము గర్భము ధరించి సంతానము కలిగి ఉండాలి అని ఆశిస్తున్నారు అని అర్థము అవుతుంది. ఇది కేవలము ఈ శరీరమునకు మాత్రమే కాకుండా మన ఆత్మకు కూడా వర్తిస్తుంది. మనము ఆయన స్వరూపము, పోలికెలో పలించి, అదే విధము గా సంతానము కనాలి. అలాగున భూమిని మరలా ఆయన ఆశించిన నరులతో నింపాలి. కేవలము మన యొక్క వంశములు కొనసాగటానికి, మన పేరులు చరిత్రలో తుడిచిపెట్టుకుపోకుండా అనుకోకూడదు . దానివలన దేవుడు ఆశించిన చిత్తము భూమిమీద నెరవేరదు , మన పోలికె, స్వరూపము వలన కూడా అది సాధ్యము కాదు. మొదట మనము ఆత్మలో ఫలించితేనే మనము కనే సంతానము ఫలిస్తారు. లేకపోతే కేవలము శరీర పరముగా ఫలించటము అవుతుంది. శరీర కార్యములు ఎంత వినాశనము తీసుకువస్తాయి అనే విషయము చరిత్ర చూస్తే మన అందరికీ అర్థము అవుతుంది మనము కలిగి ఉన్నదే మన సంతానమునకు ఇవ్వగలము మరి నీవు ఆత్మీయముగా ఫలించి నీ తరువాతి తరమునకు మాదిరిగా ఉన్నావా?

ఈ యొక్క ఫలింపు, సంతానము కనడము అనేది వివాహ సంబంధము ద్వారా స్త్రీ, పురుషుల మధ్యన జరగాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది . ఇంక వేరే ఏ విధముగాను ఆయన అంగీకరించలేదు. ఈ విషయములో ఆయన ఏర్పరచుకొన్న భక్తులను సహితము ఆయన గద్దించడము జరిగినది. మన మొదటి పితరులు అయిన ఆదాము, హవ్వ వివాహము చేసుకున్న తరువాతనే సంతానము కలిగినట్లు మనము లేఖనములలో చూడగలము. ఈ రోజున యుక్త వయస్సు అనేది వచ్చిన తరువాత , అనగా maturity/major age వచ్చిన తరువాత సంతానము కలిగి ఉండే హక్కు, స్వంతముగా జీవించే హక్కు ప్రభుత్వములు కల్పించి ఉండవచ్చు గాక, దేవుడు మాత్రము అలాంటి హక్కులు మనకు ఇవ్వలేదు అనే విషయము గ్రహించాలి. దేవుని యొక్క రాజ్యమును నాశనము చేయటానికి, సాతను మనుష్యుల ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వముల ద్వారా కల్పించిన పద్ధతులు ఇవి. అయితే మనకు ఇవ్వబడిన స్వేచ్ఛను, పాపమునకు ఆస్పదముగా మనము ఉపయోగించకూడదు అని కూడా లేఖనము/ పరిశుద్ద గంధము సెలవిస్తుంది. మనము అందరమూ శరీర విషయములో ప్రభుత్వమునకు, ఆత్మ విషయములో దేవునికి accountability అనేది కలిగి ఉన్నాము. పాపము చేయటానికి మన శరీరము తప్ప ఏ ప్రభుత్వము కూడా మనలను ప్రోత్సహించడము లేదు, బలవంతము చేయడము లేదు అని గ్రహించాలి. అవకాశము ఉందికదా అని పాపము చేయకూడదు. నీ జీవితములో ఇలాంటి పాపములు ఏమైనా ఉంటే ఇపుడే దేవుని దగ్గర పశ్చాత్తాప పడి క్షమాపణ అడుగు. ఆయన చేరదీయటానికి సిద్ధముగా ఉన్నాడు